రూ.20 వేల హెడ్ ఫోన్ ఆర్డర్ చేస్తే.. 20 రూపాయల టూత్ పేస్ట్ పంపాడు

రూ.20 వేల హెడ్ ఫోన్ ఆర్డర్ చేస్తే.. 20 రూపాయల టూత్ పేస్ట్ పంపాడు

ఇప్పుడు మొత్తం ఆన్ లైన్ షాపింగ్ నడుస్తుంది.   ఏం కొనాలన్న జస్ట్  ఇంట్లో కూర్చుని ఆర్డర్ పెడితే చాలు  చకచక ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఆన్‌లైన్ షాపింగ్ ఎలా విస్తరిస్తుందో.. అంతేస్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఒక వస్తువు ఆర్డర్ పెడితే అసలు సంబంధమే లేకుండా  మరొకటి వస్తుంది.  తాజాగా ఇలాంటి మోసానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది.  

యశ్ ఓఝా అనే ఓ కస్టమర్ ఎంతో ఇష్టంగా సోనీ కంపెనీకి చెందిన రూ.  20 వేల విలువైన హెడ్‌ఫోన్స్‌ను ఆర్డర్‌ చేశాడు. వారం రోజుల తరువాత ఆర్డర్ ఇంటికి వచ్చింది. సంతోషంగా అది ఓపెన్ చేస్తే అందులో  హెడ్‌ఫోన్స్‌కు బదులుగా కోల్‌గేట్‌ టూత్‌ పేస్ట్ వచ్చింది. దీంతో అతను ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలాడు.  జరిగిందంతా ఆ వీడియోలో చెప్పాడు.  

పార్శిల్ లో ఉన్న బిల్లు రిసిప్ట్ల్  పైన కూడా హెడ్ ఫోన్స్ అనే రాసి ఉన్నప్పటికీ.. అందులో టూత్ పేస్ట్ ఉందని చెబుతూ వీడియోలో తెలిపాడు.  ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది . ఈ వీడియోపై అమెజాన్‌ సైతం స్పందించింది. జరిగిన తప్పుకు అతడికి క్షమాపణలు చెప్పింది. ఈ సమస్యను వెంటనే పరిష్కారిస్తామని హామీ ఇచ్చింది. 

ఇలాంటి సంఘటన జరగడం ఇదేం మొదటిసారి కాదు.  ఫోన్‌లు ఆర్డర్ చేస్తే సబ్బులు రావడం,  రాళ్లు రావడం లాంటి ఘటనలు చూశాం..  కానీ ఇలాంటివి పదేపదే జరుగుతున్న వాటిపై ఆన్ లైన్ సంస్థలు కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం.