
అమెజాన్ ఇండియా సోమవారం ఎయిర్ కార్గో సర్వీస్ అమెజాన్ ఎయిర్‌ను ప్రారంభించింది. ప్రొడక్ట్‌లను వేగంగా డెలివరీ చేసేందుకు ఈ విమానాన్ని వాడతారు. రాష్ట్ర ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ అమెజాన్ ఎయిర్‌ను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ప్రారంభించారు. దేశంలో ఎయిర్ కార్గో నెట్‌వర్క్‌ను తీసుకొచ్చిన మొదటి ఈకామర్స్ కంపెనీగా అమెజాన్ నిలిచింది. ప్రస్తుతం రెండు విమానాలు ప్రొడక్ట్‌ల డెలివరీని చేపడతాయని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా అన్నారు. ఒక్కో విమానం 20 వేల షిప్‌మెంట్లను మోస్తుందని చెప్పారు. క్విక్‌జెట్‌తో పార్టనర్‌షిప్ కుదుర్చుకున్నామని, తమ కోసం విమానాలను ఆపరేట్, మెయింటైన్ చేయడం వంటివి ఈ కంపెనీ చూస్తుందన్నారు.