డెలీవరీ చేశాక సెల్ఫీ..అమెజాన్‌ కొత్త రూల్

డెలీవరీ చేశాక సెల్ఫీ..అమెజాన్‌ కొత్త రూల్

శాన్‌ ఫ్రాన్సిస్కో : కొనుగోలు దారుడికి కచ్చితంగా డెలివరీ అందేలా చూడటం, మోసాలు తగ్గించడానికి ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌ వినూత్ననిర్ణయం తీసుకుంది. అమెరికాలో డెలివరీ చేసే వాహనాల డ్రైవర్లు తమ డ్యూటీని ప్రారంభించే ముందు సెల్ఫీలు తీసుకొని అప్‌ లోడ్‌ చేయాలని ఆదేశిస్తోంది. దీనివల్ల ఫేషియల్‌ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా డెలివరీ ఏజెంట్ల వ్యక్తిగత వివరాలను నిర్ధారించుకోవడం సులువు అవుతుంది. అనధికార వ్యక్తులు డెలివరీలు ఇవ్వడం కుదరదు. ఒకే అకౌంటును ఎక్కువ మంది ఉపయోగించడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ నిబంధన ఫ్లెక్స్ డ్రైవర్స్‌‌‌‌కు మాత్రమే ఉండేది. వీళ్లు అమెజాన్‌ ప్రైమ్‌ఆర్డర్లను తమ సొంత కార్లలో డెలివరీ చేస్తారు. ఒక గంటకు వీరికి 25 డాలర్లు (దాదాపు రూ.1,734)చెల్లిస్తారు. ఇక నుంచి డెలివరీ డ్రైవర్లంతా తమ బయోమెట్రిక్‌ వివరాలు ఫ్లెక్స్‌‌‌‌ ఆప్‌ లో నమోదు చేయాలి. క్యాబ్‌ అగ్రిగ్రేటర్‌ ఉబర్‌ కూడా గతంలోఇలాంటి ప్రయత్నంచేసింది. డ్రైవర్లంతా డ్యూటీ ఎక్కేముందే సెల్ఫీలు అప్‌ లోడ్‌ చేయాలని సూచించింది. సాంకేతిక సమస్యల వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కాకపోవడంతో నిలిపివేసింది.