అమెజాన్ నుంచి ఎర్లీ డీల్స్.. అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి..!

అమెజాన్ నుంచి ఎర్లీ డీల్స్.. అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి..!

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025కు ముందు 'ఎర్లీ డీల్స్'ను ప్రకటించింది. సెప్టెంబర్ 13న మొదలయ్యే ఈ ఆఫర్లలో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లు, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ప్రధాన ఫెస్టివల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు 24 గంటల ముందుగానే యాక్సెస్ లభిస్తుంది. ఇప్పుడు వన్‌‌‌‌‌‌‌‌ప్లస్ నార్డ్ సీఈ4, ఐక్యూఓఓ జెడ్‌‌‌‌‌‌‌‌10 లైట్ లాంటి స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లు తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. 

ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, స్మార్ట్‌‌‌‌‌‌‌‌టీవీలపై 45 శాతం వరకు, రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌‌‌‌‌‌‌‌లపై 65 శాతం వరకు తగ్గింపు ఉంది. దుస్తులు, సౌందర్య ఉత్పత్తులపై 50--–80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే లేటర్ ఉపయోగించి రూ.60, వేల వరకు ఇన్‌‌‌‌‌‌‌‌స్టంట్ క్రెడిట్ పొందవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయమూ ఉంది. బుక్స్, బొమ్మలు, అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తులపై కూడా ఆఫర్లు ప్రకటించారు.  కొన్ని రకాల క్రెడిట్​కార్డులతో కొంటే ఇన్​స్టంట్ ​డిస్కౌంట్ ​పొందవచ్చని అమెజాన్​ తెలిపింది.