
హైదరాబాద్, వెలుగు: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్సేల్ సందర్భంగా తెలంగాణ నుంచి భారీగా ఆర్డర్లు వచ్చాయని, పెద్ద ఎత్తున వ్యాపారం జరిగిందని అమెజాన్ తెలిపింది. తెలంగాణ కస్టమర్లు ప్రీమియం ఉత్పత్తులను, అప్‌గ్రేడ్‌లను ఎక్కువగా ఎంచుకుంటున్నారని అమెజాన్ ఇండియా వైస్–ప్రెసిడెండ్ సౌరభ్ శ్రీవాస్తవ చెప్పారు. ‘‘రూ. 20 వేల కంటే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.
హైదరాబాద్‌లో 55 అంగుళాల కంటే ఎక్కువ సైజుల గల ప్రీమియం టీవీల అమ్మకాలు 25శాతం పెరిగాయి. కిరాణా అమ్మకాలు దాదాపు 40శాతం పెరిగాయి. తెలంగాణలోని చిన్న మధ్య తరహా వ్యాపారాల (ఎస్‌ఎంబీ) నుంచి రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే రూ. కోటి కంటే ఎక్కువ అమ్మకాలు సాధించిన ఎస్‌ఎంబీల సంఖ్య 50శాతం పెరిగింది”అని ఆయన వివరించారు.