అమెజాన్‎లో ఆఫర్ల వెల్లువ.. రూ. 1.6 లక్షల టీవీ రూ. 79 వేలకే..

V6 Velugu Posted on Jan 16, 2022

అమెజాన్‎లో రిపబ్లిక్ డే ఆఫర్లు ప్రారంభమయ్యాయి. ప్రైమ్ మెంబర్లకు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ 2022 ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వచ్చింది. అమెజాన్‎లో రిపబ్లిక్ డే ఆఫర్లు ఈ నెల 17 నుంచి 20 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులోకి వచ్చినా..  ఈ అర్ధరాత్రి తర్వాతి నుంచి మిగతా వారందరికీ కూడా ఈ సేల్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై అమెజాన్ భారీ ఆఫర్లు ప్రకటించింది.

ప్రస్తుతం యువత మొత్తం స్మార్ట్‌ఫోన్లకే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ల విషయానికొస్తే.. వన్‌ప్లస్ 9 ప్రొ 5జీ ప్రస్తుత ధర రూ. 64,999గా ఉంది. కానీ రిపబ్లిక్  పండుగ సందర్భంగా ఆ ఫోన్ రూ. 55,999కే అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసే వినియోగదారులకు అదనంగా మరో రూ. 5వేల రాయితీ కూడా లభించనుంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేసి కొనుగోలు చేస్తే అదనంగా ఇంకో రూ. 5 వేలు డిస్కౌంట్ లభించనుంది. వీటితోపాటు నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు, బండిల్డ్ ఎక్స్‌చేంజ్‌పై రూ. 19,900 వరకు ఆఫర్లు ఉన్నాయి. రియల్‌మి నార్జో 50ఎ అసలు ధర రూ. 13,990 కాగా, దానిని సంక్రాంతి ఆఫర్ కింద రూ. 11,499కు, షియోమీ 11 లైట్‌ను ఎన్‌ఈ 5జీని రూ. 25,999కి లభించనున్నాయి. 

ఇక మిగతా అమెజాన్ ప్రోడక్ట్‎ల విషయానికొస్తే.. కిండల్ 10వ జనరేషన్‌ ధరను రూ. 1000 తగ్గించి రూ. 6,799కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే ధరను ఏకంగా రూ. 2,500 తగ్గించి రూ. 3,499కి లిస్ట్ చేసింది. రెడ్‌‌మి 50 అంగుళాల 4కె అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ ధర రూ. 44,999 కాగా, దానిని రూ. 30,001కు తగ్గించింది. శాంసంగ్ ది సెరీఫ్ సిరీస్ 55 అంగుళాల క్యూలెడ్ టీవీ ధరను భారీగా తగ్గించింది. ఈ టీవీ ధర రూ. 1,63,900గా ఉంటే.. రిపబ్లిక్ డే సందర్భంగా ఆ టీవీ ధరను సగానికి తగ్గించి రూ. 79,990కి అందుబాటులో ఉంచింది.

For More News..

ప్రభుత్వ ఉత్తర్వులు పట్టించుకోని టీఆర్ఎస్ నేతలు

వామ్మో.. జయమ్మ పంచాయితీ మామూలుగా లేదుగా

ఆన్‎లైన్ తరగతులపై ఓయూ కీలక ప్రకటన

Tagged amazon, business, electronics, Amazon Great Republic Day Sale 2022, Amazon Prime Members, Best Deals on Mobile Phones

Latest Videos

Subscribe Now

More News