న్యూఢిల్లీ: బ్రాండెడ్ కాని, తక్కువ రేటున్న ప్రొడక్ట్‌లను అమ్మేందుకు ‘బజార్’ ను అమెజాన్ లాంచ్ చేసింది. ఈ కేటగిరీలో దూసుకుపోతున్న మీషోతో బజార్ పోటీపడుతుంది. అమెజాన్ మెయిన్ సైట్‌లోనే ఆన్‌లైన్ బజార్ పేజి ఉంటుంది.
రూ.600 లేదా అంతకంటే తక్కువ విలువున్న ప్రొడక్ట్‌లు అమెజాన్ బజార్‌లో దొరుకుతాయి. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షాప్సీతో కూడా బజార్ పోటీ పడనుంది. దీని కింద జాయిన్ అయిన సెల్లర్ల నుంచి రిఫరల్ ఫీజును అమెజాన్ వసూలు చేయడం లేదు. కానీ, డెలివరీస్ కొద్దిగా స్లోగా ఉండొచ్చు.