అమెజాన్ మరో అడుగు

అమెజాన్ మరో అడుగు

కొత్తగా10 ఫుల్‌ఫిల్‌‌మెంట్ సెంటర్లు.. హైదరాబాద్‌‌లోమరొకటి
స్టో రేజ్ కెపాసిటీ 20శాతం పెంపు
32 మిలియన్ క్యూబిక్ ఫీట్‌గా స్టోరేజ్ కెపాసిటీ
పెట్టుబడులు పెడుతూనే ఉంటాం.. అమెజాన్
మొత్తంగా ఇండియాలో 60కి పైగా ఫుల్‌ఫిల్‌‌మెంట్ సెంటర్లు

న్యూఢిల్లీ : అమెజాన్ ఇండియాలో తన ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ నెట్‌‌వర్క్‌‌ను విస్తరిస్తోంది. కొత్తగా 10 సెంటర్లను ప్రకటించింది. అంతేకాక ప్రస్తుతమున్న 7 సెంటర్లను విస్తరించనున్నట్టు పేర్కొంది. ఈ విస్తరణతో, అమెజాన్‌‌కు ఇండియాలో 15 రాష్ట్రాల్లో 60కి పైగా ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్లుంటాయి.
మొత్తం స్టోరేజ్ కెపాసిటీ 32 మిలియన్ క్యూబిక్‌ ఫీట్‌కు పైగా పెరగనుంది. కొత్త ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్లలో పెద్ద పెద్ద అప్లియెన్సస్, ఫర్నిచర్ పెట్టవచ్చు. ఈ సెంటర్ల ఫ్లోర్ ఏరియానే 80 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉండనుంది. ల్యాండ్ సైజు కూడా లక్షల కొద్దీ ఇంటి సామాను పెట్టేలా సెట్ చేస్తోంది. ఇండియాలో తమ దీర్ఘకాల పెట్టుబడుల కమిట్‌‌మెంట్‌‌కు అనుగుణంగా తమ స్టోరేజ్ కెపాసిటీ పెంపు ఉందని అమెజాన్ ఇండియా కస్టమర్ ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ ఆపరేషన్స్, ఏపీఏసీ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా అన్నారు. ఇండియన్ కస్టమర్లకు అవసరమైన ప్రతీది అందివ్వడమే తమ ధ్యేయమని చెప్పారు. మా కస్టమర్లను, మా వర్క్‌‌ప్లేస్‌‌లను సురక్షితంగా ఉంచేందుకు చూస్తున్నామని కూడా తెలిపారు. 60కి పైగా ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్లతో, వేల కొద్దీ ఉద్యోగవకాశాలను కూడా సృష్టిస్తున్నట్టుగా చెప్పారు. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీలో తాము పెట్టేపెట్టుబడులు, సెల్లర్లు మరింత దగ్గరగా కస్టమర్లను చేరుకోవడానికి ఉపయోగపడనున్నాయని, మరిన్ని ప్రొడక్ట్ లను వేగంగా డెలివరీ
చేయనున్నామని హామీ ఇచ్చారు. ప్యాకే జింగ్, ట్రాన్స్‌‌పోర్టేషన్, లాజిస్టిక్స్ లాంటి వ్యాపారాలకు తాము సాయం చేయనున్నామని చెప్పారు.

హైదరాబాద్‌‌లో మరోఫుల్‌ఫిల్‌‌మెంట్ సెంటర్…
ప్రస్తుతం అమెజాన్ ప్రకటించిన కొత్త ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్లు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పాట్నా, కోల్‌‌కతా, చెన్నై, లుధియానా, అహ్మదాబాద్‌‌లలో ఏర్పాటు కానున్నాయి. అమెజాన్‌‌కు హైదరాబాద్‌‌లో శంషాబాద్‌‌ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్టుకు దగ్గర్లో అతిపెద్ద ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్ ఉంది. ఇది 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 2.1 మిలియన్ క్యూబిక్‌ ఫీట్‌ స్టోరేజ్ స్పేస్‌‌తో ఇది ఉంది. తెలంగాణలో మొత్తంగా అమెజాన్‌‌కు ఇప్పటి వరకు 3 ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్లున్నాయి. ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్ల విస్తరణతో వేగంగా, కస్టమర్లకు, సెల్లర్లకు మరింత సౌకర్యవంతంగా ప్రొడక్ట్ లను డెలివరీ చేయనుంది. రాబోతున్న ఫెస్టివ్ సీజన్‌‌కంటే ముందు నుంచే అన్ని కొత్త ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని అమెజాన్ చెప్పింది. ‘ఈ కరోనా సమయంలో, ఇండియా గ్రోత్‌కు, ఉద్యోగాల సృష్టికి ఈ–కామర్స్ కీలకంగా మారింది. ఫిజికల్ ప్రొక్యూర్‌‌‌‌మెంట్ అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌‌గా మారింది. ఈ–కామర్స్ రివాల్యుయేషన్ ఇండియాలో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ సెగ్మెంట్‌‌ లో అమెజాన్ ఇండియాలో ప్రజలకు సురక్షితంగా ప్రొడక్ట్ లను అందజేయనుంది. కిరాణా స్టోర్లతో కలిసి పనిచేస్తుంది. మార్కెట్ విస్తరణ, ప్యాకే జింగ్, ప్రొడక్షన్‌‌ల నుంచి ఇచ్చే సపోర్ట్ తో కిరాణాలు ప్రయోజనం పొందనున్నాయి. ఇండియన్ ఎకానమీలో ఇది పలు దశల్లో ప్రభావం చూపనుంది. ఇండియాలో అమెజాన్ కంటిన్యూగా పెట్టుబడి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అమెజాన్ ఇండియాలో రెగ్యులర్ బేసిస్‌‌లో ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను అభివృద్ధి చేస్తోంది. అమెజాన్ మన ఎంఎస్‌‌ఎంఈలకు, కళాకారులకు కూడా మార్కెట్ యాక్సెస్‌‌ను అందించడం అభినందనీయం’ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు.

రిలయన్స్‌‌ రిటైల్‌లో 9.9% వాటా కొంటున్న అమెజాన్‌‌?
రిలయన్స్ రిటైల్‌లో 9.9 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఈ–కామర్స్‌‌ కంపెనీ అమెజాన్ రెడీ అవుతోందని వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయంపై అమెజాన్‌‌, రిలయన్స్‌‌ రిటైల్‌ స్పందించలేదు. ఈ ఏడాది మే నెలలో స్టార్ట్‌‌ అయిన రిలయన్స్ రిటైల్‌ ఈ–కామర్స్‌‌ వెంచర్‌‌‌‌ జియో మార్ట్‌‌ అమెజాన్‌‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌‌లకు పోటీ ఇస్తోంది. ప్రత్యేకంగా ఈ వెంచర్‌‌‌‌ కోసమే రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్‌‌ ఇన్వెస్ట్‌‌ చేయాలనుకుంటోందని వార్తలు వస్తున్నాయి. కాగా, లోకల్‌ షాప్‌లను తమ ప్లాట్‌ఫామ్‌కు యాడ్‌ చేసుకోవడానికి ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్‌‌ ఓ ప్రోగ్రామ్‌ను లాంఛ్ చేసింది. రిలయన్స్ జియోలోని కొంత వాటాను అమ్మడం ద్వారా ముకేష్‌ అంబానీ ఇప్పటికే 20 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌‌మెంట్లను పొందారు. ఇందులో గూగుల్‌, ఫేస్‌‌బుక్‌ పెట్టుబడులు కూడా ఉన్నాయి.

For More News..

పేమెంట్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా 5 నిమిషాల్లో లోన్!

గ్రీన్ కార్డ్ కోసం ఓ వ్యక్తి 195 ఏండ్ల వెయిటింగ్ లిస్ట్!

చైనా మార్స్  ప్రోబ్ ప్రయోగం సక్సెస్

ఇక నుంచి ఆర్మీలో మహిళలకు కీలక బాధ్యతలు