అమెజాన్‌లో ‘మినీ టీవీ’.. ఫ్రీగా వీడియోలు చూసుకోవచ్చు

అమెజాన్‌లో ‘మినీ టీవీ’.. ఫ్రీగా వీడియోలు చూసుకోవచ్చు

న్యూఢిల్లీ: వీడియో స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను ఫ్రీగా అమెజాన్‌‌‌‌ అందిస్తోంది. కంపెనీ యాప్‌‌‌‌లోనే  ‘మినీ టీవీ’ ఫీచర్‌‌‌‌‌‌‌‌  ఉంటుంది. గ్లోబల్‌‌‌‌గా మొదట ఇండియాలోనే ఈ స్ట్రీమింగ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను అమెజాన్ తీసుకొచ్చింది.  మినీ టీవీలో  వెబ్ సిరీస్‌‌‌‌లు, టెక్‌‌‌‌ న్యూస్‌‌‌‌, ఫుడ్‌‌‌‌, బ్యూటీ, ఫ్యాషన్‌‌‌‌ వంటి వివిధ కేటగిరీలకు చెందిన కంటెంట్‌‌‌‌ను ఫ్రీగా చూడొచ్చు. కానీ, యాడ్స్‌‌‌‌ ఉంటాయి. ఇప్పటి వరకు అమెజాన్‌‌‌‌ యాప్‌‌‌‌లో షాపింగ్, పేమెంట్స్ చేసుకోవడానికి వీలుండేది. తాజాగా ఫ్రీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ వీడియోలను కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫీచర్‌‌‌‌‌‌‌‌నే 2019 లో ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ తెచ్చిన విషయం తెలిసిందే. ‘ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ వీడియోస్‌‌‌‌’ పేరుతో ఫ్రీగా వీడియో కంటెంట్‌‌‌‌ను కంపెనీ అందిస్తోంది.  

అమెజాన్‌‌‌‌ యాప్‌‌‌‌లోనే కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌

ప్రస్తుతం ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌ కేవలం ఆండ్రాయిడ్‌‌‌‌  ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని నెలల్లో ఐఓఎస్‌‌‌‌, మొబైల్ వెబ్‌‌‌‌ల కోసం అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌‌‌‌ బాగా పాపులరయ్యింది. కాగా, మినీ టీవీలో కంటెంట్ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. సపరేట్ యాప్ అవసరం లేదు. కానీ, అమెజాన్ ప్రైమ్‌‌‌‌ వీడియోస్ కోసం సపరేట్ యాప్ డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకోవాలి. కంటెంట్ చూడాలంటే సబ్‌‌‌‌స్క్రిప్షన్ అవసరం.  ప్రైమ్‌‌‌‌లో అమెజాన్ ఒరిజినల్స్‌‌‌‌, మూవీస్‌‌‌‌, టీవీ షోలు ఇంగ్లిస్‌‌‌‌, 9 లోకల్ లాంగ్వేజ్‌‌‌‌లలో ఉంటాయి.