Amazon: అమెజాన్ పేకు ఆర్బీఐ భారీ జరిమానా

Amazon: అమెజాన్ పేకు ఆర్బీఐ భారీ జరిమానా

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ పైకు ఆర్బీఐ షాకిచ్చింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు అమెజాన్ పే ఇండియాకు రూ. 3.06 కోట్ల జరిమానా విధించింది. ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్ స్ట్రుమెంట్స్ , కేవైసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

అయితే నిబంధనల పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చెప్పాలని  అమెజాన్ పై కు షోకాజ్ నోటీసు ఇచ్చామని ఆర్బీఐ వెల్లడించింది. అమెజాన్  నిబంధనలను పాటించలేదని రుజువైన తర్వాతే పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.