
హైదరాబాద్, వెలుగు: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 ఆఫర్లను ప్రకటించింది. సేల్ఈ నెల 12–14 తేదీల్లో ఉంటుంది. ఇది ప్రైమ్ సభ్యులకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఆడియో ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్ ఉంటాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా, ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13ఎస్, ఐక్యూ నియో 10 వంటి టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపు ఉంటుందని అమెజాన్ తెలిపింది. టాప్బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు, టాబ్లెట్‌లపై 60 శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది.
హెడ్‌ఫోన్‌లు, స్పీకర్‌ర్లపై 80 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని అమెజాన్ పేర్కొంది. వివిధ టీవీ మోడళ్లపై 65 శాతం వరకు తగ్గింపు ఇస్తామని పేర్కొంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు కొనుగోళ్లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.