
బిజినెస్‌డెస్క్, వెలుగు: అమెజాన్‌లో సెల్లర్లు తెలుగులోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న సెల్లర్లు అమెజాన్ సర్వీస్‌లను తెలుగులో పొందొచ్చు. సెల్లర్ రిజిస్ట్రేషన్ అండ్ అకౌంట్ మేనేజ్‌మెంట్ సర్వీస్‌లను తెలుగులో తీసుకొచ్చామని మంగళవారం అమెజాన్ ప్రకటించింది. ఈ చర్య వలన ఇప్పటికే రిజిస్టర్ అయిన వేల మంది సెల్లర్లు, కొత్తగా రిజిస్టర్ కాబోతున్న సెల్లర్లకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఎనిమిది లాంగ్వేజ్‌లలో అమెజాన్ సెల్లర్ యాప్, వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. సెల్లర్లు తెలుగు, బెంగాలి, గుజరాతి, హింది, కన్నడ, మరాఠి, మలయాళం, తమిళ్, ఇంగ్లిష్ భాషల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అకౌంట్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. సెల్లర్ యాప్ లేదా వెబ్‌సైట్లలో లాంగ్వేజ్‌ను తెలుగులో మార్చుకోవాలనుకునే సెల్లర్లు సెట్టింగ్స్‌లోకి వెళ్లి భాషను చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మార్చాక సెల్లర్ వెబ్‌సైట్ లేదా యాప్ తెలుగులో కనిపిస్తుంది.