లీగల్​ ఖర్చుల కోసం 8 వేల కోట్లు ఖర్చుచేసిన అమెజాన్

లీగల్​ ఖర్చుల కోసం 8 వేల కోట్లు ఖర్చుచేసిన అమెజాన్

న్యూఢిల్లీ: మన దేశంలో ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెజాన్​ ఏకంగా రూ. 8,546 కోట్లను లీగల్​ ఖర్చుల కోసం వెచ్చించింది. 2018–20 మధ్య కాలంలో ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టినట్లు లీగల్​ ఫైలింగ్స్​ ద్వారా తెలుస్తోంది. లంచాల ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇంటర్నల్​గా దర్యాప్తు జరుగుతోందని ఇప్పటికే అమెజాన్​ వెల్లడించింది. ఫ్యూచర్​ గ్రూప్​ టేకోవర్​విషయంలో అమెజాన్​ లీగల్​గా పోరాడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కాంపిటీషన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా (సీసీఐ) కూడా అమెజాన్​పై దర్యాప్తు జరుపుతోంది. లీగల్​ ఫీజులపై అమెజాన్​   మాట్లాడానికి ఇష్టపడలేదు. అయితే, అమెజాన్​ తన రెవెన్యూలో ఏకంగా 20 శాతాన్ని లాయర్లపై ఖర్చు పెట్టిందని దేశంలోని ట్రేడర్స్​ బాడీ సెయిట్​ ఆరోపిస్తోంది.  ఈ లీగల్​ ఖర్చులను చూస్తే, ప్రభుత్వాధికారులను మానిప్యులేట్​ చేయడానికే వాడి ఉంటారని అర్ధం అవుతోందని సెయిట్​ ​ సెక్రటరీ జనరల్​ ప్రవీణ్​ ఖండేల్వాల్​ కామర్స్​ మినిస్టర్​ పీయూష్​ గోయెల్​కు లెటర్​ రాశారు. తన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపని ఆయన, సీబీఐ ఎంక్వయిరీని డిమాండ్​ చేశారు.