అమ్మవారికి అంబానీ కానుక 20 కిలోల బంగారం

అమ్మవారికి అంబానీ కానుక 20 కిలోల బంగారం

గుహవాటి: భారత దేశ అపర కుబేరుడు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అసోంలోని కామాఖ్యదేవి అమ్మవారి ఆలయానికి 20 కిలోల బంగారం కానుకగా ఇచ్చారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కామాఖ్య దేవి ఆలయానికి మొక్కుబడిలో భాగంగా అంబానీ దంపతులు భారీ ఎత్తున బంగారం విరాళంగా అందించారు. మూడు నెలల క్రితం అంబానీ దంపతులు దర్శించుకున్న సందర్భంగా  గోపుర కలశాల తయారీ కోసం 20 కిలోల బంగారం అవసరం అవుతుందని ఆలయ అధికారులు అంబానీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. గోపుర కలశాలకు బంగారం తాపడానికి అయ్యే ఖర్చును తాము భరించేందుకు సిద్ధమని తెలియజేశారు. అంబానీ దంపతులు ముంబైకి తిరిగి వెళ్లిన అనంతరం కామాఖ్య ఆలయ వర్గాలకు అధికారికంగా సమాచారం ఇవ్వగా సన్నాహాలు సిద్ధం చేశారు. హామీ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరఫున 20 కిలోల బంగారాన్ని అందించగా ఆలయానికి అందించగా దేవస్థానం అధికారులు  కలశాల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఈ కలశాల నిర్మాణ కార్యక్రమంలో శిల్పులతో పాటు రిలయన్స్ ఇంజినీర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ కలశాలు పూర్తయిన తర్వాత ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ మరోసారి కామాఖ్య అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రముఖ శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయం అసోంలోని నీలాచల కొండల్లో కొలువై ఉంది. ఇక్కడికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.