ఏపీ సీఎం జగన్ తో అంబటి రాయుడు భేటి... 

ఏపీ సీఎం జగన్ తో అంబటి రాయుడు భేటి... 

రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఆ దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. గత నెల 11న సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు మళ్లీ ఈ రోజు ( జూన్ 8)న  మరోసారి సీఎంతో భేటీ అవ్వడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాయుడు.. జగన్ ను కలిసేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ( జూన్ 8) న  సీఎం వైఎస్ జగన్ తో భేటీ  అయ్యారు. 

2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు.. IPLలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున చివరి మ్యాచ్‌ ఆడారు.  ఐపీఎల్ కప్ సాధించిన సీఎస్‌కే టీంను ఏపీ  ముఖ్యమంత్రి   వైఎస్‌ జగన్‌ అభినందించారు.  ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నానని  అంబటి రాయుడు సీఎం కు వివరించారు.  ఆయన  సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.  

క్రికెటర్ అంబటిరాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వీటిపై అంబటి రాయుడు ఎప్పుడు పెద్దగా స్పందించలేదు. అయితే ఆయన తాజాగా తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో సీఎం జగన్‌తో భేటి అయ్యారు. ఈ భేటిలో అంబటిరాయుడు ఏపీలో క్రీడల అభివృద్ది,శిక్షణ,యువతకు అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో సీఎం జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను అంబటి రాయుడు ట్విటర్ వేదికగా ప్రశంసిస్తూ..వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అంబటిరాయుడు త్వరలోనే వైసీపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.