ఆర్సీబీ జట్టుపై సెటైర్లు.. రాయుడు కుటుంబానికి చంపేస్తామని బెదిరింపులు

ఆర్సీబీ జట్టుపై సెటైర్లు.. రాయుడు కుటుంబానికి చంపేస్తామని బెదిరింపులు

ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా ఆడింది. ఫస్ట్ హాఫ్ లో 8 మ్యాచ్ ల్లో ఒకటే విజయం సాధించిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్ ల్లో గెలిచి ఊహించని విధంగా ప్లే ఆఫ్స్ లో స్థానం సంపాదించింది. ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలు బెంగళూరుకు అనుకూలంగా రావడం కలిసి వచ్చింది. చివరి లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 27 పరుగులతో అద్భుత విజయం సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో ఆ జట్టు సంబరాలు ఆకాశాన్ని అంటాయి. భారీ ఎత్తులో సంబరాలు చేసుకున్నారు. 

ప్లే ఆఫ్స్ అసలు అర్హత సాధించదనుకున్న ఆర్సీబీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేసరికి ప్రతి ఒక్కరు ఆర్సీబీ పోరాట పటిమను అభినందించారు. కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. అయితే భారత మాజీ క్రికెటర్.. మన తెలుగు బ్యాటర్ అంబటి రాయడు మాత్రం అనూహ్యంగా ఆర్సీబీ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రానా ఐపీఎల్ టైటిల్ గెలవలేరు అంటూ సూటిగా విరాట్ ను టార్గెట్ చేశాడు.

రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ అతనిపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఈ క్రమంలో రాయుడిని విమర్శించడమే కాదు.. అతని కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. కోహ్లీని అవమానిస్తావా అంటూ..రాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని తాజాగా రాయుడు ఫ్రెండ్ చెప్పిన మాటలు ప్రస్తుతం చర్చనీయాంశయంగా మారాయి. ఈ విషయంలో నెటిజన్స్ రాయుడికి అండగా నిలుస్తున్నారు. 

కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ రెచ్చిపోయి.. అతడి కుటుంబంపై దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారని.. రాయుడు భార్య, పిల్లలపై లైంగిక దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని రాయుడు స్నేహితుడు సామ్ పాల్ అన్నారు. ప్రతి వ్యక్తికి రాజ్యంగం కొన్ని హక్కులు కల్పిస్తుందని.. ఈ విషయంపై పోలీసులు, న్యాయవ్యవస్థ కలగజేసుకుని వారిని కఠినంగా శిక్షించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నెటిజన్స్ రాయుడికి అండగా నిలుస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dr. Sam Paul (@sampaul222)