అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వివేక్ వెంకటస్వామి

అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వివేక్ వెంకటస్వామి

దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా డా. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకట స్వామి అన్నారు. షాబాద్ మండలం చర్లగూడ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మ శ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు వెంకటస్వామి ఫౌండేషన్ తరఫున లక్ష రూపాయల చెక్ అందజేసి సన్మానించారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి వేగవంతమవుతుందని అంబేడ్కర్ చెప్పారని, ఆయన వల్లే 8గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని చెప్పారు. 

అంబేడ్కర్ ఆశయం మేరకు అందరూ చదువుకొని మంచి భవిష్యత్ సాధించాలని వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. పేద ప్రజలకు చదువుకు దూరంకాకూడదనే అంబేడ్కర్ కాలేజీ స్థాపించానన్న ఆయన.. వారసులుగా తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తామని చెప్పారు. ఎవరైనా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాననంటే అందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు వివేక్. 

మరిన్ని వార్తల కోసం..

రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించాలన్న బైడెన్

ఉక్రెయిన్‌లో థియేటర్పై మిస్సైల్ దాడి.. 300 మంది మృతి