
నవీపేట్, వెలుగు : మండలంలోని అబ్బపూర్ బీ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని టాస్క్ ఫోర్స్ ఎస్సై సుధాకర్ ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. చదువుతోనే గుర్తింపు వస్తుందని, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
కార్యక్రమం లో ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ కన్వీనర్ నిరడి ఈశ్వర్, సింగర్ మచ్చ దేవేందర్, సీడబ్ల్యూసీ కేంద్ర ఎస్సీ, ఎస్టీ యూనియన్ కన్వీనర్ పర్మికోటేశ్వ ర్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సింగరి పాండు, నిరడి రవి తదితరులు పాల్గొన్నారు.