
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: రాజ్యాంగాన్ని గౌరవించి దళితుల రాజ్యం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాంలీలా గ్రౌండ్స్‌లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలు ఏకతాటిపైకి రావాలని సూచించారు. కార్యక్రమంలో దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, లీడర్లు సందీప్ దాండిగే, బోర్లాకుంట దీపక్, నాగసేన్ మాన్కర్, అల్లూరి భూమన్న, ప్రశాంత్, ప్రజ్ఞకుమార్, సొగల సుదర్శన్, అనిల్ సవ్వడే, తదితరులు పాల్గొన్నారు.