రెన్యూవబుల్ ఎనర్జీ కోసం రూ.ఆరు వేల కోట్లు

 రెన్యూవబుల్ ఎనర్జీ కోసం రూ.ఆరు వేల కోట్లు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌‌కు చెందిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, 2026 నాటికి 1,000 మెగావాట్ల రెన్యువబుల్​ ఎనర్జీ (ఆర్​ఈ)ని ఉత్పత్తి చేసే  ప్రాజెక్టులలో రూ. 6,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సోమవారం తెలిపింది. కంపెనీ అంతర్గత వనరుల నుంచి నిధులను తెచ్చుకుంటామని ప్రకటించింది. ఈ డబ్బు ద్వారా గుజరాత్,  రాజస్థాన్‌‌లలో సోలార్​, విండ్​పవర్​ ప్రాజెక్టులను నిర్మిస్తామని అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ (ఏసీఎల్​) తెలిపింది. గుజరాత్‌‌లో 600 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, 150 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్,  రాజస్థాన్‌‌లో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను కడతారు. 

 ప్రస్తుతం ఉన్న 84 మెగావాట్లకు అదనంగా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి  200 మెగావాట్ల సోలార్​ పవర్​ను ఉత్పత్తి చేస్తారు.  సంస్థ సిమెంట్​ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 ఎంటీపీఏ (సంవత్సరానికి మిలియన్ టన్నులు)లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మొత్తం ఇంధన వినియోగంలో 60 శాతం గ్రీన్ పవర్​ను ఉపయోగించాలని భావిస్తోంది.  గ్రీన్ పవర్ వ్లల ఉత్పత్తికి తక్కువ ఖర్చు అవుతుందని, కరెంట్​ ధర కిలోవాట్​ అవర్​కి రూ. 6.46 నుంచి రూ. 5.16కి తగ్గుతుందని తెలిపింది.