దాడి గురించి అమెరికాకు ముందే తెలుసా?

దాడి గురించి అమెరికాకు ముందే తెలుసా?
  • దాడి గురించి అమెరికాకు ముందే తెలుసా?
  • సీరియస్​గా తీసుకోని వైట్ హౌస్ 

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్​పై హమాస్ మిలిటెంట్లు దాడి చేయబోతున్నారనే విషయం అమెరికాకు ముందే తెలుసని ఓ రిపోర్టు బయటకొచ్చింది. అయితే దాన్ని అమెరికా సీరియస్ గా తీసుకోలేదని ఆ రిపోర్టు పేర్కొంది. ‘‘ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడికి కొన్ని వారాల ముందే.. అమెరికా ఇంటెలిజెన్స్ కు ఆ విషయం తెలిసింది. ఇజ్రాయెల్ పై దాడి జరిగే అవకాశం ఉందని వైట్ హౌస్ ను ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది. రాకెట్లతో భారీ దాడులకు పాల్పడే చాన్స్ ఉందని పేర్కొంది. 

హమాస్ యాక్టివిటీ అనుమానాస్పదంగా ఉందని దాడికి ఒకరోజు ముందు ఇజ్రాయెల్ లోని అధికారులు వైట్ హౌస్ కు రిపోర్టు పంపారు. కానీ దీన్ని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సీరియస్ గా తీసుకోలేదు. దాడి విషయాన్ని ఇజ్రాయెల్ తో చెప్పిందో లేదో కూడా తెలియదు” అని రిపోర్టులో ఉన్నట్టు ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది. కాగా, ఇజ్రాయెల్, గాజా, వెస్ట్ బ్యాంక్ పై అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పుడూ నిఘా పెడతారు. అక్కడ జరిగే విషయాలను ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి అధికారులకు తెలియజేస్తారు.