చైనా కట్టడికి ఇండియాకు అండగా ఉంటామన్న అమెరికా

చైనా కట్టడికి ఇండియాకు అండగా ఉంటామన్న అమెరికా

చైనా దూకుడుకు పగ్గాలేద్దాం

ఇండియాకు అండగా ఉంటామన్న అమెరికా

2+2 చర్చల్లో భాగంగా ‘బెకా’పై సంతకాలు

గల్వాన్ వీరులకు నివాళులర్పించిన పాంపియో

‘బెకా’తో సమాచార మార్పిడికి కొత్త దారులు: రాజ్​నాథ్

న్యూఢిల్లీ: తమ సార్వభౌమత్వాన్ని, స్వేచ్ఛను కాపాడుకునేందుకు ఇండియా చేసే ప్రయత్నాల్లో అమెరికా అండగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. తూర్పు లడఖ్‌‌‌‌లోని గల్వాన్ లోయలో ఇండియన్ సైనికులను చైనా మిలటరీ హత్య చేయడాన్ని ప్రస్తావించారు. ఒక్క చైనా నుంచే కాక.. అన్ని వైపుల నుంచి ఎదురయ్యే ముప్పులను దృష్టిలో ఉంచుకుని, దీటుగా ఎదుర్కొనేందుకు ఇండియా, అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నామని అన్నారు. మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్‌‌‌‌ హౌస్‌‌‌‌లో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ టి.ఎస్పర్ మధ్య 2+2 వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా తూర్పు లడఖ్‌‌‌‌లో, ఇండో పసిఫిక్ రీజియన్​లో, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో చైనా దూకుడుగా వ్యవహరించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. చైనా విస్తరణవాదంపై చర్చించారు. ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్న ‘బెకా’పై సంతకాలు చేసుకున్నారు.

సహకారం పెంచుకునేందుకు…

2+2 వ్యూహాత్మక చర్చల తర్వాత జైశంకర్, రాజ్​నాథ్, ఎస్పర్​తో కలిసి పాంపియో మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియా కోసం ప్రాణత్యాగం చేసిన 20 మంది సోల్జర్లను గౌరవించేందుకు నేషనల్ వార్ మెమోరియల్​ను సందర్శించినట్లు తెలిపారు. డెమోక్రసీకి, రూల్ ఆఫ్ లాకు, ట్రాన్స్​పరెన్సీకి చైనీస్ కమ్యూనిస్టు పార్టీ.. ఫ్రెండ్ కాదనే విషయంపై అమెరికా లీడర్లు, ప్రజల్లో ఇప్పుడు క్లారిటీ పెరుగుతోందని చెప్పారు. కరోనా వైరస్‌‌‌‌, భద్రతా సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ భద్రత, సుస్థిరత కోసం ఇండియా, అమెరికా భాగస్వామ్యం అత్యంత కీలకమని మార్క్‌‌‌‌ ఎస్పర్‌‌‌‌ కామెంట్ చేశారు.

ఫోకస్ ఇండో-పసిఫిక్ రీజియన్​పైనే

ఇండో–పసిఫిక్ రీజియన్​లో భద్రతా పరిస్థితులపై చర్చించామని, ఈ ప్రాంతంలోని అన్ని దేశాల శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్​నాథ్ చెప్పారు. ‘‘రూల్స్ ఆధారిత ఇంటర్నేషనల్​ఆర్డర్​ను కొనసాగించడం, రూల్ ఆఫ్ లా ను గౌరవించడం, అంతర్జాతీయ సముద్రాల్లో స్వేచ్ఛగా తిరగనివ్వడం, అన్ని దేశాల టెర్రిటోరియల్ ఇంటెగ్రిటీ, సార్వభౌమత్వాన్ని గౌరవించడం చాలా అవసరం’’ అని తెలిపారు. తమ చర్చల్లో ఇండో–పసిఫిక్ ప్రాంతంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు జైశంకర్ అన్నారు. క్రాస్ బార్డర్ టెర్రరిజం ఆమోదయోగ్యం కాదని స్పష్టంగా
చెప్పామన్నారు.

‘బెకా’పై సంతకాలు

ఎంతోకాలంగా చర్చల్లో ఉన్న బేసిక్ ఎక్స్​చేంజ్ అండ్ కో ఆపరేషన్ అగ్రిమెంట్(బెకా) ఫైనల్​ అయ్యింది. ఈ అగ్రిమెంట్​పై రెండు దేశాల నేతలు సంతకాలు చేశారు. బెకా ద్వారా హై ఎండ్ మిలటరీ టెక్నాలజీ, క్లాసిఫైడ్ శాటిలైట్ డేటా, జియో స్పాటికల్ మ్యాపులు, మిలటరీలకు చెందిన క్రిటికల్ సమాచారం పంచుకునేందుకు వీలుంటుంది. బెకా ఒప్పందం ముఖ్యమైన నిర్ణయమని, ఒప్పందాన్ని పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉందని రాజ్​నాథ్ అన్నారు. సమాచార మార్పిడి కొత్త మార్గాలను తెరిచిందని చెప్పారు. అమెరికాతో మిలటరీ టు మిలటరీ కో ఆపరేషన్ చాలా బాగా ముందుకు సాగుతోందని చెప్పారు.

మోడీని కలిసిన అమెరికా మంత్రులు

ప్రధాని మోడీని అమెరికా మంత్రులు మైక్ పాంపియో, మార్క్ టి.ఎస్పర్ కలిశారు. 2+2 లెవెల్ మీటింగ్ తర్వాత ఇద్దరూ వెళ్లి ప్రధాని తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్​లో కేంద్ర మంత్రులు జైశంకర్, రాజ్​నాథ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్, ఇండియాలో అమెరికా అంబాసిడర్ కెన్ జస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఇండియాటూర్ తర్వాత పాంపియో, ఎస్పర్.. శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియాలో పర్యటిస్తారు.

For More News..

మావోయిస్ట్‌ల కోసం హెలికాప్టర్​తో కూంబింగ్​

స్మార్ట్ ఫోన్ వాడకంతో నష్టాలెంటో తెలిస్తే.. మళ్లీ ఫోన్ ముట్టరు

చంద్రునిపై మస్తు నీళ్లు.. తేల్చిన నాసా..