అమెరికా నటుడు విలియం హర్ట్ కన్నుమూత

అమెరికా నటుడు విలియం హర్ట్ కన్నుమూత

ఆస్కార్ విజేత, ప్రముఖ అమెరికా నటుడు విలియం హర్ట్ (71) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశాడు. విలియం మృతిని ఆయన కుమారుడు విల్ హర్ట్ ధృవీకరించాడు. విలియం హర్ట్ కు టెర్మినల్ ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గతంలో నిర్ధారణ అయింది. పెద్ద స్టార్ అయి ఉండి కూడా విలియం చాలా నిరాడంబర జీవితాన్న గడిపాడు. 

ఇక విలియం హర్ట్ యాక్టింగ్ జీవితానికొస్తే.. 1980 లో "ఆల్టర్డ్ స్టేట్స్"లో మొదటిసారి నటించాడు విలియం. అనంతరం 1985లో "కిస్ ఆఫ్ ది స్పైడర్ వుమన్"లో  అతడు పోషించిన ఖైదీ పాత్రకు గాను విలియం మొదటి ఆస్కార్ అందుకున్నాడు. 1986లో వచ్చిన "చిల్డ్రన్ ఆఫ్ ఎ లెస్సర్ గాడ్" లో చెవిటి విద్యార్థుల ఉపాధ్యాయుడిగా,  1987లో రిలీజైన "బ్రాడ్‌కాస్ట్ న్యూస్" లో స్లో-విట్టెడ్ టెలివిజన్ యాంకర్ గా  హర్ట్ ఆస్కార్‌లకు నామినేట్ అయ్యాడు. ఎ హిస్టరీ ఆఫ్ వాయిలెన్స్ మూవీకి విలియం తన రెండో ఆస్కార్ అందుకున్నాడు. 
 
ది ఇన్‌క్రెడిబుల్ హల్క్, కెప్టెన్ అమెరికా: సివిల్ వార్, ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, ఎవెంజర్స్: ఎండ్‌గేమ్, బ్లాక్ విడో, గోర్కీ పార్క్, ఆలిస్, అన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో విలియం తన అభిమానులను కట్టిపడేశాడు. ముఖ్యంగా ది బిగ్ చిల్, ఎ హిస్టరీ ఆఫ్ వాయిలెన్స్ చిత్రాలు విలియంకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. విలియం మృతిపై ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం...

నాటో దేశాల సరిహద్దుల్లో రష్యా బాంబులు

తల్లికి మందుల కోసం వెళ్తుంటే చంపేసిన్రు