కరోనాతో హార్ట్ ఫెయిల్!

కరోనాతో హార్ట్ ఫెయిల్!

గుండె కణాల్లో వైరస్ చేరడంతో పగులు
ఆ దేశంలో కరోనాతో చనిపోయిన తొలి వ్య‌క్తి ఈ పేషెంటే
అమెరికాలో చనిపోయిన పేషెంట్లో గుర్తించిన‌ సైంటిస్టులు

వాషింగ్ట‌న్: కరోనా ఎఫెక్ట్ శరీరంలో ఏయే పార్టుల‌పై, ఎట్లుటుందన్న‌ది ఇప్ప‌టికీ పూర్తిగా తేలలేదు. ప్ర‌ధానంగా ఊపిరితిత్తులు, శ్వాస వ్య‌వ‌స్థ‌పైనే ప్ర‌భావం చూపే ఈ వైరస్ తో.. హార్ట్ కు కూడా డేంజరేనని అమెరికా సైంటిసుట్లు గుర్తించారు. గుండె కణాల్లో విస్త‌రించిన వైరస్ కారణంగా పగులు ఏర్ప‌డుతుంద‌ని, ఇది హార్ట్ఎటాక్ కు దారి తీస్తుందని తేల్చారు. కరోనాతో చనిపోయిన ఓ మహిళ పోస్టుమార్టం సమయంలో దీనిని నిర్ధారించారు. ప్ర‌ఖ్యాత సైన్స్ పత్రిక‌ లైవ్ సైనస్ ఆ వివరాలను పబ్లిష్ చేసింది. అమెరికాలో కరోనాతో చనిపోయిన తొలి వ్య‌క్తి ఈ మహిళే కావడం గమనారం.

ముందు హార్ట్ ఎటాక్ అనుకుని..

కాలిఫోర్నియాలో ఫిబవరి 6న ఓ 57 ఏడేళ్ల‌ మహిళ జలుబు ల‌క్ష‌ణాలతో చనిపోయింది. అయితే అప్ప‌టికీ అమెరికాలో కరోనా వ్యాప్తి పెద్త‌గా లేకపోవడం, ఆమె గుండె ఆగి మరణించినట్టు ప్రాథమికంగా గుర్తించడంతో.. హార్ట్ ఎటాక్ గా భావించారు. కానీ పోస్టుమార్ట‌మ్ లో ఆమె గుండె పగిలిపోయి ఉండటం చూసిన డాక్ల‌ర్లు.. అనుమానంతో టెస్టులుచేశారు. గుండె కండరాలను సేకరించి బయాపీస్కి పంపించారు.  రిపోర్టులో ఆమెకు కరోనా ఉన్న‌ట్లు తేలింది. గుండె కణాలకు వైరస్ వ్యాపించిందని..శరీరంలో విడుదలైన యాంటీ బాడీస్ వైరస్ పై ఎటాక్ చేసే కమంలో గుండె కణాలను దెబ్బ తీశాయ‌ని సైంటిస్టులు గుర్తించారు.

చైనా సర్వేల్లోనూ ఇదే రిజల్ట్

చైనా సైంటిస్టులు చేసిన రీసెర్చ్ లోనూ ఈ వైరస్ కు, గుండె దెబ్బ‌తినడానికి లింక్ ఉందని గుర్తించారు. ప్రతి ఐదుగురు కరోనా పేషెంటల్లో ఒకరికి గుండెపై ఎఫెక్ట్ పడుతోందని తేల్చారు. కరోనా కణాలకు అతుక్కునేందుకు తోడ్ప‌డే ‘ఏసీఈ2 ఎంజైమ్ ’ఊపిరితిత్తులతో పాటు గుండె కణాల్లోనూ ఉంటుందని.. దీంతో గుండెకూ వైరస్ విస్త‌రిస్తోంద‌ని తెలిపారు.