
హెచ్ ఐవీ.. ఈ పేరు వినగానే ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ గుర్తొస్తుంది. ప్రమాదకరమైన హ్యూమన్ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ .. రోగ నిరోధక వ్యవస్థను మెల్లిగా నాశనం చేసి ప్రాణాలు తీస్తుంది.అయితే అలాంటి వైరస్ సాయంతోనే ప్రాణాలు కాపాడుతున్నారు అమెరికా పరిశోధకులు. ‘బబుల్‌బేబీ’ వ్యాధితో బాధపడుతున్న పసికందుల ఆరోగ్యాన్ని హెచ్‌ఐవీతో బాగుచేశారు. ఇంతకీ బబుల్ బేబీ వ్యాధి ఎలా వస్తుంది?.. హెచ్ ఐవీ ఆ వ్యాధిని ఎలా నయం చేస్తుందో చూద్దాం.
పుట్టిన చిన్నారుల్లో రోగ నిరోధక
వ్యవస్థ బలహీనంగా ఉన్నా, లేదంటే అస్సలు లేకపోయినా ఆ వ్యాధిని ‘బబుల్ బేబీ’గా పిలుస్తారు. ఈ వ్యాధితో బాధపడుతున్నపిల్లలకు కంటిన్యూగా చికిత్స అందించాలి. లేకపోతే చిన్న వయసులోనే చనిపోతారు. ప్రధానంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ద్వారా ఈ వ్యాధికి చికిత్స అందిస్తారు. అయితే మూలకణ దాతలు దొరకడం చాలా కష్టం. పైగా ఇది జెనెటిక్ డిజార్డర్ కూడా. అలాంటప్పుడు బ్లడ్ స్టెమ్ సెల్స్ ద్వారా చికిత్స అందిస్తారు. జన్యు థెరపీ ద్వారా చిన్నారుల్లో రోగనిరోధకశక్తిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.అయితే అందుకు ఏళ్ల తరబడి సమయం పట్టొచ్చు. ఒక్కోసారి చికిత్సా సమయంలోనేపిల్లల ప్రాణాలు పోతుంటాయి. టెన్నిస్ కు చెందిన పరిశోధకులు హెచ్ఐవీకి కొన్నిమార్పులు చేసి పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నించి.. విజయం సాధించారు.
ట్రీట్ మెంట్ కొనసాగిందిలా..
జన్యు థెరపీలో పుట్టిన వెంటనే శిశువులనుంచి బోన్ మ్యారోను సేకరిస్తారు. ఆ వెంటనేడీఎన్ ఏలోని జన్యులోపాన్ని సరిచేస్తారు.మెంఫిస్ నగరంలోని సెయింట్ జ్యూడ్‌రీసెర్చ్ క్లినిక్ కి చెందిన పరిశోధకుల బృందం ఈ దఫా ప్రయోగంలో కొత్త విధానాన్నిఅనుసరించింది . జన్యులోపాన్ని సరి చేసేక్రమంలో.. సరైన జన్యువులోకి మార్పులు చేసిన హెచ్‌ఐవీ వెర్షెన్ (అల్డర్ట్ వెర్షెన్ ) చొప్పించింది .ఈ విధానం ద్వారా శాన్ ఫ్రాన్సి స్కోలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది చిన్నారులకు జెన్యు థెరపీని కొనసాగించింది .ఆశ్చర్యకరంగా పిల్లల్లో రోగ నిరోధక శక్తిపెరగడం మొదలైంది . మూడు నెలల్లో వారి రోగనిరోధక వ్యవస్థ దాదాపుగా సాధారణ స్థితికి చేరింది . ఈ చికిత్స పూర్తి వివరాలు ‘న్యూఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఇది అసలు మ్యాటర్
బబుల్ బేబీ వ్యాధిని సైంటిఫిక్ గా‘ఎస్ సీఐడీ’(సివియర్ కంబైన్డ్ ఇమ్యునోడెఫిషియన్సీ సిం డ్రోమ్) అంటారు. ఈ సిండ్రోమ్ తో పుట్టిన చిన్నారులు చాలా సున్నితంగా ఉంటారు. ఎంతలా అంటే..జలుబు చేసినా కూడా వాళ్లకు ప్రాణాపాయం రావొచ్చు. మనిషి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి ‘ఐఎల్–2ఆర్జీ’ జన్యువు కారణం. ఈ జన్యువు లోపిస్తేఎస్ సీఐడీకి దారి తీస్తుంది . సాధారణంగా ఈ సిండ్రోమ్ లో రకాలు ఉంటాయి.ఎక్కువ కేసులు ‘ఎస్ సీఐడీ-ఎక్స్ టైప్ –1’నమోదవుతుంటాయి. ఈ టైప్ లో బోన్ మ్యారోట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం రక్త సంబంధీకులనుంచి మూలకణాలను సేకరించాలి.ఒక్కోసారి చికిత్స సమయంలో సైడ్ ఎఫెక్ట్‌లుచాలా వస్తుం టాయి.
ఇతర థెరపీలు
ఎస్ సీఐడీ-ఎక్స్ టైప్–1 సిం డ్రోమ్ కి ఇప్పుడున్న అత్యుత్తమ విధానం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఎముక మూలుగ మార్పిడి).ఈ వ్యాధి సోకిన చిన్నారికి రక్తసంబంధీకులనుం చి సేకరిం చిన కణజాలంతో చికిత్సచేస్తారు. అయితే వందలో ఎనభై పేషెంట్లకు ఈ తరహా చికిత్స విధానం ప్రభావం చూపదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఇతరుల రక్తంలోంచి సేకరించిన మూలకణాలపై ఆధారపడుతుంటారు. పైగా ఈ చికిత్సా విధానంతో వ్యాధినయమయ్యే అవకాశాలు చాలా తక్కువ.అంతేకాకుండా, తీవ్రమైన ప్రతికూలప్రభావాలు ఎదురవుతాయి. అయితే గతరెండు దశాబ్దాలలో జెన్ థెరపీలో వచ్చినమార్పులు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కి ప్రత్యామ్నాయాలుగా మారాయి. కానీ, ఈ చికిత్సా విధానంలో తలసేమియా, సికిల్‌సెల్ అనీమియా.. లాంటి రక్త సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఫస్ట్ టైం.. సక్సెస్!
ఈ పరిశోధన వివరాలను పేర్కొంటూ డాక్టర్ ఎవెలీనా మమ్ కార్జ్ ఒక వ్యాసం రాశారు. ‘‘ఎస్ సీఐడీ-ఎక్స్1 బాధితులకు ఈ తరహా చికిత్స అందించడం ఇదే తొలిసారి. ట్రీట్ మెంట్ కు చిన్నారులు స్పందిస్తున్నారు. బయటి ప్రపంచంలో సోకే ఇన్ ఫెక్షన్ల నుంచి తమను తాము కాపాడుకొనేందుకు,సాధారణంగా జీవించేందుకు అవసరమైన రోగ నిరోధక వ్యవస్థ వాళ్లలో ఏర్పడింది . వీళ్లలోఎక్కువ మంది చికిత్స తర్వాత నెల రోజులకే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు’’ అనిఎవెలీనా పేర్కొంది .