నీట్ వివాదం : ఇస్రో మాజీ చీఫ్ తో.. ఏడుగురు సభ్యుల హైలెవల్ కమిటీ

నీట్ వివాదం : ఇస్రో మాజీ చీఫ్ తో.. ఏడుగురు సభ్యుల హైలెవల్ కమిటీ

నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ తర్వాత కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరీక్షలు సజావుగా నిష్పక్షపాతంగా  నిర్వహించేందుకు ఏడుగురు సభ్యులతో   హైలెవల్ నిపుణుల కమిటీ వేసింది. ఏడుగురు సభ్యుల ఈ కమిటీకి ఇస్రో మాజీ ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ ఛైర్మన్ గా ఉండనున్నారు.  కేంద్ర విద్యాశాఖ.  సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ఎన్టీయే పనితీరు మెరుగుపరిచేందుకు సూచనలు ఇవ్వనుంది ఈ కమిటీ. కమిటీ తన నివేదికను 2 నెలల్లో కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది.

ప్యానెల్‌లోని నిపుణులు ఎవరంటే?

ఈ కమిటీలో  ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్  డా. రణ్‌దీప్ గులేరియా,  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్. బి.జె. రావు,    ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కె. రామమూర్తి ,  కర్మయోగి భారత్‌ సహ వ్యవస్థాపకుడు పంకజ్‌ బన్సల్‌, ఐఐటీ దిల్లీ డీన్‌ (విద్యార్థి వ్యవహారాలు) ప్రొఫెసర్‌ ఆదిత్య మిత్తల్‌, కేంద్ర విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌ సభ్యులుగా ఉన్నారు.