ఢిల్లీ లిక్కర్ స్కాం: అమిత్ అరోరాకు మరో వారం కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం: అమిత్ అరోరాకు మరో వారం కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీ లాండరింగ్ కేసులో అమిత్ అరోరా ఈడీ కస్టడీని పొడిగించింది కోర్టు. మరో వారం రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది . ఇవాల్టితో అమిత్ అరోరా కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు పురోగతిని ఆఫీసర్లు కోర్టుకి వివరించారు . కేసు దర్యాప్తు కొనసాగుతుందని... అరోరా కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది . అధికారుల విజ్ఞప్తితో కస్టడీ పొడిగించిని కోర్టు.. తదుపరి విచారణ డిసెంబర్ 13 కు వాయిదా వేసింది .

నవంబర్ 30న అమిత్ అరోరాను అరెస్ట్ చేసిన ఈడీ..  వారం రోజుల పాటు విచారించింది. కస్టడీ ముగియడంతో అరోరాను  కోర్టులో హాజరుపరిచారు. అరోరాను కలిసిన మరో ఆరుగురిని ప్రశ్నించాల్సి ఉందని ఇందుకోసం మరో వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. వాదనలు విన్న న్యామమూర్తి అమిత్ అరోరాకు ఏడు రోజుల పాటు కస్టడీ పొడిగించింది. ఇప్పటికే అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. దీంతో కవితకు నోటీసులిచ్చిన సీబీఐ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని  తన నివాసంలో  విచారించనుంది.