
- సర్’పై రాహుల్ రాజకీయాలు చేస్తున్నారు: అమిత్షా
బిహార్: బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) చేపట్టిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. చొరబాటుదారుల పేర్లను తొలగించడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. శుక్రవారం బిహార్‌లోని సీతామర్హి జిల్లా పునౌరాధంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ‘సర్’ ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఆర్జేడీ వంటి ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. చొరబాటుదారుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని, వారికి ఓటు హక్కు ఇవ్వడం కరెక్ట్కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘సర్’పై రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.