చంద్రబాబుది దిగజారుడు రాజకీయం: అమిత్ షా

చంద్రబాబుది దిగజారుడు రాజకీయం: అమిత్ షా

నేతల విమర్శలు, ఆరోపణలతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్ గా విమర్శల దాడి చేశారు బీజేపీ చీఫ్ అమిత్ షా.గురువారం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించారు అమిత్ షా.  ఐదేళ్లలో ఏపీలో 90 శాతం హామీలు నెరవేర్చామన్నారు అమిత్ షా. 20 ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రానికి ఇచ్చామన్నారు. రాజమండ్రిలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన..  ఉభయగోదావరి జిల్లాల పదాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులిచ్చినా  ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయిందన్నారు. చంద్రబాబుకు పాకిస్థాన్  ప్రధానిపై భరోసా ఉంది గానీ, దేశ  ప్రధానిపై లేదని విమర్శించారు.పుల్వామా ఉగ్రదాడిని దేశమంతా ఖండిస్తుంటే… చంద్రబాబు పాకిస్థాన్ చర్యను సమర్థించారని అన్నారు.

బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శలను పట్టించుకోకుండా అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కడప జిల్లా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలతో సమావేశమైన బాబు… రాజంపేట, పీలేరు, రాయచోటి, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించారు. రేపు కడప పార్లమెంటు నియోజకవర్గం నేతలతో భేటీ కానున్నారు చంద్రబాబు.