అల్లర్లకు పాల్పడే దమ్ము ఎవరికీ లేదు: అమిత్ షా

అల్లర్లకు పాల్పడే దమ్ము ఎవరికీ లేదు: అమిత్ షా

నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు దేశమంతా ఉగ్రవాదులు రక్తంతో హోలీ ఆడేవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ పాలనలో కఠినమైన నిబంధనలతో దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేశామన్నారు. గుజరాత్ లోని మెహ్సానా జిల్లాలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి మేధా పాట్కర్ నడవడంపై అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. నర్మాదా డ్యామ్ ప్రాజెక్టు 20 ఏండ్లు నిలిపి వేసిన వ్యక్తి మేధా పాట్కర్ అని ఆరోపించారు. గుజరాత్ లో మతపరమైన అల్లర్లకు పాల్పడే దమ్ము ఎవరికీ లేదన్నారు. చారిత్రాత్మక సోమనాథ్ ఆలయాన్ని అనేక సార్లు పునరుద్ధరించామన్నారు. ఓ వర్గం ఓట్ల కోసం సాంస్కృతిక, మతపరమైన ప్రదేశాలను కాంగ్రెస్ ఎప్పుడూ పునరుద్ధరించలేదని షా ఆరోపించారు.