శిక్ష కన్నా న్యాయానికి పెద్దపీట వేశాం.. కొత్త చట్టాలపై అమిత్ షా

శిక్ష కన్నా న్యాయానికి  పెద్దపీట వేశాం.. కొత్త చట్టాలపై అమిత్ షా

మహిళలకు సత్వరం న్యాయం జరిగేలా కొత్త చట్టాలు తెచ్చామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొత్త క్రిమినల్ చట్టాలపై మాట్లాడిన ఆయన.. శిక్ష కన్నా న్యాయానికి  పెద్దపీట వేశామని చెప్పారు.ప్రతి  పోలీస్ స్టేషన్లో ఈ - కేసులు నమోదు చేయవచ్చన్నారు. చార్జ్ షీట్ ఇక పెన్ డ్రైవ్ లో సబ్ మిట్ చేయవచ్చని చెప్పారు.   టెక్నాలజీ ఆధారంగా కొత్త చట్టాల్లో మార్పులు చేశామన్నారు.  బాధితులు, ఫిర్యాదు దారుల హక్కులు కాపాడుతామని చెప్పారు. 

చట్టాలపై చర్చ పెట్టినా విపక్షాలు పాల్గొనలేదన్నారు అమిత్ షా.  కొత్త చట్టాలపై 2020లో  సీఎంలతో పాటు, ఎంపీలకు  లేఖ రాశామన్నారు. కొత్త చట్టాలపై విపక్షాలతో చర్చించే చట్టాల్లో  మార్పులు చేశామన్నారు. చట్టాలపై ఫిర్యాదు చేయాలంటే తన  ఆఫీస్ కు రావాలని చెప్పారు. 

ఈ మూడు  కొత్త చట్టాలు జులై 1 నుంచి అమలులోకి వచ్చాయని చెప్పారు.  ఇప్పుడు, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) బదులుగా భారతీయ న్యాయ సంహిత (BNS) ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)కి బదులుగా..  భారతీయ సాక్ష్యాధారాల చట్టం . (BSA)కు బదులుగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ఉంటుందని వెల్లడించారు.