గెహ్లాట్ మ్యాజిక్​తోనే రాజస్థాన్‌‌ నాశనం : అమిత్ షా

గెహ్లాట్ మ్యాజిక్​తోనే రాజస్థాన్‌‌ నాశనం :  అమిత్ షా

జైపూర్ :  అశోక్ గెహ్లాట్ అధికారంలోకి వచ్చిన తర్వాత  రాజస్థాన్‌‌లో  శాంతిభద్రతలు లేకుండా పోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. గ్రామాల్లో కరెంట్ కనుమరుగవడంతో పాటు గత ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలన్ని మాయమైపోయాయని తెలిపారు. గెహ్లాట్ మ్యాజిక్ వల్లే రాష్ట్రం నాశనమైందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అమిత్ షా  కుచమన్‌‌ ర్యాలీలో పాల్గొన్నారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో అన్ని రకాల లిమిట్స్ దాటిందని తెలిపారు. ఆ పార్టీని ఓడించి రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించాలని ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. గెహ్లాట్ హయాంలో ఉదయపూర్ టైలర్ కన్హయ్యలాల్ హత్యతో పాటు వివిధ మతపరమైన ఘటనలు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. అక్రమ మైనింగ్​తో కోట్లు సంపాదించారని, నియామక పరీక్షల పేపర్ల లీక్‌‌  అలవాటుగా మారిందన్నారు. 

గెహ్లాట్ జోధ్‌‌పూర్‌‌లోని  మెజిషియన్ కుటుంబంలో జన్మించాడని..ఆయన కొంతకాలం ఇంద్రజాలికుడైన తన తండ్రికి సాయం చేశాడని గుర్తుచేశారు. తండ్రి ద్వారా నేర్చుకున్న మ్యాజిక్ తో  గెహ్లాట్‌‌ రాష్ట్రంలో శాంతిభద్రతలను మాయం చేశాడని ఎద్దేవా చేశారు.