CAA కింద 188 మంది పాకిస్తానీ హిందువులకు భారత పౌరసత్వం

CAA కింద 188 మంది పాకిస్తానీ హిందువులకు భారత పౌరసత్వం

అహ్మదాబాద్:సిటిజన్ అమెండ్ మెంట్ యాక్ట్ (CAA) కింద మరికొంత మంది పాకిస్తానీ హిందువులకు భారత పౌరసత్వం ఇవ్వనున్నారు. గుజరాత్ లోని అహ్మదా బాద్ లో 188 మంది పాకిస్తానీ హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు శుక్రవారం ఆగస్టు 16,2024 న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంగీకరించారు. 

కొత్తగా అమలు చేస్తున్న సిటిజన్ అమెండ్ మెంట్ యాక్ట్ (CAA) కింద పాకిస్తాన్ లో మతపరమైన హింసను ఎదుర్కొని ఇండియాకు పారిపోయి వచ్చిన పాకిస్తానీ శరణార్థి హిందువులకు అహ్మదాబాద్ లో భారత పౌరసత్వం కల్పించనున్నారు. 

2024 ప్రారంభంలో భారత్ కు పొరుగున ఉన్న మూడు దేశాలనుంచి వేధింపులకు గురై శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం అందజేశారు. అహ్మదాబాద్ జిల్లాలో ఇప్పటివరకు గుజరాత్ ప్రభుత్వం 1167 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది.  జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ప్రసత్తం అహ్మదాబాద్ లో నివసిస్తున్న వారికి సిటిజన్ షిప్ ఐడీ కార్డులు అందజేశారు.