సంక్రాంతి తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. సంక్రాంతి తర్వాత వేగం పెంచేందుకు పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈనెల 28న రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. పార్టీ సంస్థాగత అంశాలే ప్రధాన అజెండాగా అమిత్ షా పర్యటన ఉండనుంది. వివిధ స్థాయిలో పార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సంఘ్ నేతలతో కూడా అమిత్ షా సమావేశం అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు అంతకంటే ముందుగానే రాష్ట్రంలో కేసీఆర్, మోడీ బహిరంగ సభలు జరగనున్నాయి. రెండు రోజుల తేడాతో రెండు బహిరంగ సభలు జరగనుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. మోడీ, అమిత్‌ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు చేస్తుంటే.. బీజేపీ నేతలంతా కేసీఆర్, కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ అదే స్థాయిలో విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇక అమిత్ షా పర్యటనకు ముందే కేసీఆర్ సభ ఉండటంతో తర్వాత పరిణామాలు ఎలా ఉండనున్నయో చూడాల్సి ఉంది.
