కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ నిరసన

కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ నిరసన
  •     కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత

కరీంనగర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం సీపీఐ లీడర్లను అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు.

తోపులాటలో పంజాల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం వేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని మండిపడ్డారు. ఆందోళనలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సృజన్ కుమార్, అశోక్, లక్ష్మి, సమ్మయ్య,, రాజు పాల్గొన్నారు.

నస్పూర్: పెట్రోల్, గ్యాస్​, నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని డిమాండ్  చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్​ ప్రజలపై పన్నుల భారం మోపుతూ, కార్పొరేటర్లకు వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తోందని ఆరోపించారు.