Amitab Bachchan: కల్కి సినిమా కోసం అమితాబ్ భారీ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!

Amitab Bachchan: కల్కి సినిమా కోసం అమితాబ్ భారీ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitab Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఒక సినిమాలో నటిస్తున్నారంటే ఆ సినిమా రేంజ్ ఆటోమేటిగా నెక్స్ట్ లెవల్ కు చేరుకోవడం ఖాయం. అందుకే ఈ మధ్య ఆయన సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుత ఆయన చేస్తున్న మరో భారీ సినిమా కల్కి 2898 AD(kalki 2898 AD). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అదేంటంటే.. ఈ సినిమా కోసం అమితాబ్ కళ్లుచెదిరిపోయే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. కేవలం 45 రోజుల కాల్షీట్ కోసం ఏకంగా రూ.18 కోట్ల మొత్తాన్ని రెమ్యురేషన్ గా తీసుకుంటున్నారట. అమితాబ్ కొన్నేళ్లుగా చేస్తున్న సినిమాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ న్యూస్ గా మారింది. ఇక అమితాబ్ ఈ సినిమాలో అశ్వథామ పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకి సంబందించిన టీజర్ ఈ మధ్య విడుదల చేయగా ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచేసింది.  

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.