Amitabh Bachchan: ప్రభాస్ ఫాన్స్కి సారీ.. దయచేసి నన్ను తిట్టుకోకండి

Amitabh Bachchan: ప్రభాస్ ఫాన్స్కి సారీ.. దయచేసి నన్ను తిట్టుకోకండి

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫాన్స్ కి సారీ చెప్పారు. సినిమాలో నన్ను చూసి దయచేసి తిట్టుకోకండి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో.. ఆయన ప్రభాస్ ఫ్యాన్స్ కి సారీ చెప్పడం ఏంటి? సినిమాలో ఆయన ఎం చేస్తారు? అంటూ సోషల్ మీడియాలో టాక్ మొదలయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. ఇండియన్ మైథాలజీ, స్కైఫై కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కితున్నారు. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన కల్కి ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. దీంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ ను ముంబై లో నిర్వహించారు. ఆ ఈవెంట అనంతరం కల్కి సినిమా కాస్ట్ అంతా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఫ్యాన్స్ కు సారీ చెప్పారు. దర్శకుడు నాగి ఈ సినిమా గురించి చెప్పడానికి వచ్చినప్పుడు.. నా పాత్ర, ప్రభాస్ పాత్ర ఏంటి? ఎలా ఉంటుంది అనేది వివరిస్తూ కొన్ని ఫొటోలు చూపించాడు. అలాగే  ఈ సినిమాలో నాది ప్రభాస్‪‌ని కొట్టే పాత్ర అని చెప్పాడు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ కి ముందే సారీ చెబుతున్నా. సినిమాలో నేను చేసే పనులు తిట్టుకోకండి, ట్రోల్స్ చేయకండి.. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అమితాబ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.