
ఇటీవల విడుదలైన ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకున్నారు రజినీకాంత్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మెప్పించింది. రజినీకాంత్ కెరీర్‌లో ఇది 169వ సినిమా కాగా, నెక్స్ట్ మూవీ ఎవరితో ఉండబోతోందా అనే విషయం ఇప్పటికే కన్‌ఫర్మ్ అయింది.
సూర్యతో ‘జై భీమ్’ తీసిన టీజే జ్ఞానవేల్ దీన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. సెప్టెంబర్‌లో ఈ కొత్త చిత్రం ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రను పోషించబోతున్నారట. రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనుండగా.. నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్స్‌లో బిగ్ బి కనిపించబోతున్నట్టు కోలీవుడ్ టాక్. 1991లో వచ్చిన ‘హమ్’ చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. అంటే దాదాపు ముప్ఫై రెండేళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారు.
సోషల్ మెసేజ్‌తో కూడిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఆధ్యాత్మిక యాత్రం కోసం హిమాలయాలకు వెళ్లిన రజినీకాంత్ అతి త్వరలో తిరిగి చెన్నై చేరుకోనున్నారు.