ఎంఐఎంతో కలిసి రామన్న కుట్ర..బీజేపీ జిల్లా అధ్యక్షుడు  పాయల్ శంకర్

ఎంఐఎంతో కలిసి రామన్న కుట్ర..బీజేపీ జిల్లా అధ్యక్షుడు  పాయల్ శంకర్

ఆదిలాబాద్, వెలుగు: శాంతియుతంగా ఉన్న ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే జోగు రామన్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ సాయంతో ప్రజల్లో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, తన గ్రాఫ్ పడిపోవడం చూసి భయపడి కుట్రలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆరోపించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసదుద్దీన్ ఓవైసీ ఆదిలాబాద్ లో జరిపిన సమావేశంలో హిందూ దేవాలయాలకు నిధులివ్వడం పై చేసిన కామెంట్లు హాస్యాస్పదమన్నారు.  రాష్ట్ర ఖజానాకు దేవాలయాల నుంచి భారీ మొత్తంలో ట్యాక్స్​ల రూపంలో కడుతున్నారనే విషయాన్ని గుర్తంచుకోవాలన్నారు.

 ఆదిలాబాద్ లో యువకుడిపై దాడి చేసి చిత్రహింసలు పెట్టి, పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారి కి వత్తాసు పలకడం ల బీఆర్ఎస్ ఎంఐఏం పార్టీల అక్రమ సంబంధానికి నిదర్శనమని ఆరోపించారు. ఆదిలాబాద్ లో మాకు వేల ఓట్లున్నాయి మేము ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నామంటూ ఓవైసీ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  హిందువుల ఓట్లు 1.90 లక్షలు ఉన్నాయని, సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.  సమావేశంలో నాయకులు ఆదినాత్, దినేష్ మటోలియా, రాజేశ్, నగేష్ రెడ్డి, ముకుంద్, నరేష్, నందవ్ అశోక్ ఉన్నారు.