వెయ్యి కోట్లు దాటిన మెగా హీరో ఆస్తి..

వెయ్యి కోట్లు దాటిన మెగా హీరో ఆస్తి..

టాలీవుడ్ టాప్ హీరోస్ లలో భారీగా పారితోషికం తీసుకుంటున్న హీరోస్..ఎవరనే ఆలోచన వస్తే..టక్కున గుర్తొచ్చే పేర్లు ఓ ఆరేసి  ఉంటాయి.అందులో మొదటగా ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్,చిరు..ఇలా కొంతమంది స్టార్స్ పేర్లు వినిపిస్తాయి. మరి ఇందులో ఎవరికి ఎక్కువ ఆస్తులున్నాయి? ఎవరు ఎక్కువ చేతినిండా సంపాదిస్తున్నారు. అందరు ప్రభాస్, మహేష్ బాబు అనుకుంటారు. కానీ, సౌత్లో బాగా డబ్బున్న హీరో రామ్ చరణ్ అని అతి తక్కువ మందికి తెలుసు. 

రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుత నికర ఆస్తి విలువ దాదాపు 1370 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ఈ ఫిగర్ వినడానికి కొంతమందికి  ఆశ్చర్యం వేసిన..ఇదే నిజం. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మాట నిజమే అయినా..కానీ తన టాలెంట్తో సినీ ఇండస్ట్రీలోను ,బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నాడు. అందుకే వేల కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడని చెప్పడంలో సందేహం  లేదు.

రామ్ చరణ్ కేవలం సినిమాల్లో గ్లోబల్ యాక్టర్గా ఎదిగితే..ఇతడికి ఇంత ఆస్తి రాలేదు. తనకున్న తెలివితో..ఎక్కడ ఎలా పెట్టుబడులు పెడితే లాభాల్లో వస్తాయో..తనకి బాగా తెలుసు. అలాగే టైం అడ్జస్ట్ చేసుకుంటూ..యాడ్స్ చేయడం వల్ల కూడా భారీగా డబ్బులు సంపాదించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో మీషో, సువర్ణభూమి, హీరో, మాన్యవర్, ఫ్రూటీ లాంటి ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి.

అంతేకాకుండా చరణ్కు ఓ విమానయాన సంస్థలో సగానికి పైగా పెట్టుబడులున్నాయి. ఇక రీసెంట్గా  కొణెదల ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి,ప్రొడ్యూసర్గా సినిమాలు నిర్మిస్తున్నాడు.వీటితో పాటు మరికొన్నిబిజినెస్ లు చేస్తూ..దేశంలోనే అత్యథికంగా ట్యాక్స్ కడుతున్న సెలబ్రిటీల్లో రామ్ చరణ్ ఒకరుగా మారారు.  

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే బుచ్చిబాబు సానా తో మరొక మూవీ చేస్తున్నారు.