భోగి మంటల్లో పేలుడు.. ఫ్యామిలీ సేఫ్

భోగి మంటల్లో పేలుడు.. ఫ్యామిలీ సేఫ్

అమృత్‌సర్‌కు సమీపంలోని ఒక గ్రామంలో లోహ్రీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒక కుటుంబం సంబురాలు చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు అంతా చాకచక్యంగా తప్పించుకున్నారు. కుటుంబ సభ్యులందరూ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు.

సంఘటన సమయంలో మంట పక్కనే వారంతా కూర్చున్నారు. వేడి ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించిందని అందులో ఒకరు వివరించారు. వారు ఇసుకను ఉపయోగించకుండా నేరుగా సిమెంటు నేలపై కలపను కాల్చారు. ఊహించని రీతిలో పేలుడు సంభవించడంతో కుటుంబ సభ్యులు, పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కానీ వారి దుస్తులు పాడైనట్టు తెలుస్తోంది.

భోగి మంటల వేడుకల సమయంలో, ప్రాంగణంలో, టైల్స్‌పై లేదా కార్పెట్‌లపై ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని అధికారులు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. భోగి మంటలు వేస్తే, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కింద ఇసుక లేదా మట్టిని చల్లడం మంచిదని, ఈ తరహా ఉత్సవాల్లో పాల్గొనేటప్పుడు భద్రతా చర్యలను నిర్వహించాలన్నారు.