పెరిగిన అమూల్‌‌‌‌ పాల ధరలు

పెరిగిన అమూల్‌‌‌‌ పాల ధరలు

న్యూఢిల్లీ:  అమూల్‌‌‌‌ బ్రాండ్​ పేరుతో డెయిరీ ప్రొడక్టులను మార్కెట్ చేస్తున్న గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఫుల్‌‌క్రీమ్ మిల్క్  గేదె పాల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాలకూ కొత్త ధరలు వర్తిస్తాయని ఫెడరేషన్ ఎండీ ఆర్.ఎస్.​ సోధి చెప్పారు.

మదర్ డెయిరీ కూడా ఢిల్లీలో లీటర్‌‌ ఆవు పాల (ఫుల్‌ క్రీమ్‌) పై రూ.2 పెంచింది. ఈ ఏడాది ఆగస్టులో కూడా అమూల్ పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. అదే నెలలో, మదర్ డెయిరీ సైతం ఢిల్లీ-–ఎన్‌‌సీఆర్ ప్రాంతంలో పాల ధరలను లీటరుకు 2 రూపాయలు పెంచింది. ఆగస్టులో విడుదల చేసిన క్రిసిల్ రేటింగ్స్ రిపోర్టు ప్రకారం, రిటైల్ పాల ధర లీటరుకు రూ. 2 పెంచడం వల్ల  డెయిరీ రంగం లాభదాయకత   సంవత్సరానికి 50 బేసిస్ పాయింట్ల వరకు పెరుగుతుంది.