మద్దూరు, వెలుగు : ప్రతిఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని నారాయణ పేట జిల్లా అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ దీప్తి సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం మద్దూరు పీఎస్ ఆవరణలో ఎస్ఐ విజయ్ కుమార్ తో కలిసి సడక్ సురక్షా అభియాన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ముందే బయల్దేరి గమ్యస్థానాన్ని చేరుకునేలా అలవాటుచేసుకోవాలని చెప్పారు.
బైక్నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని,సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దన్నారు. హెడ్ లైట్ రాత్రి పూట సరిగా పడుతుందో.. లేదో చూసుకోవాలని, హైవేలపై సర్కిల్ లైన్ మెయిన్టెన్చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ ఉస్మాన్, పోలీసులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు నిబంధనలు పాటించాలి
వనపర్తి టౌన్ : ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ సైదులు నాయక్ సూచించారు. శనివారం వనపర్తి జడ్పీహెచ్ ఎస్ బాయ్స్ స్కూల్ లో విద్యార్థులకు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. రోడ్డు నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని కోరారు.
