ఫార్మా కంపెనీలో మంటలు.. షాట్ సర్క్యూట్ కారణమా..?

ఫార్మా కంపెనీలో మంటలు..  షాట్ సర్క్యూట్ కారణమా..?

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలో మంగళవారం (నవంబర్ 21) భారీ అగ్నిప్రమాదం జరిగింది. MSN ఫార్మా యూనిట్ 2 పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలియగానే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేస్తున్నారు. 

స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సాల్వెంట్ కెమికల్ డ్రమ్ము దగ్గర షాట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మంటలను ఆర్పివేస్తున్నా.. ఇంకా అదుపులోకి రావడం లేదు. కంపెనీ ప్రాంగణంలో దట్టమైన పొగ అలుముకుంది.