Ram Charan: ఇది మాములు క్రేజ్ కాదు.. హాలీవుడ్ సినిమా కోసం చరణ్ లాంటోడే కావాలట

Ram Charan: ఇది మాములు క్రేజ్ కాదు.. హాలీవుడ్ సినిమా కోసం చరణ్ లాంటోడే కావాలట

ఆర్ఆర్ఆర్(RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత రామ్ చరణ్(Ram charan) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలు సైతం ఆయనతో సినిమా చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అంతలా తన నటనతో గ్లోబల్ వైడ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో సీతారామరాజు గా చరణ్ లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్.. ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ లో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు రామ్ చరణ్. దీంతో ఆయన సినిమాల గురించి గ్లోబల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

తాజాగా ఆయనకు హాలీవుడ్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది అనే విషయంపై మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రముఖ లీడింగ్ హాలీవుడ్ నిర్మాణ సంస్థ తమ నెక్స్ట్ సినిమాలో నటించే నటుల కోసం ఓక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో తమకు కావాల్సిన నటుడు ఎలా ఉండాలో చెప్తూ మొత్తం ఆరు మంది స్టార్స్ ను ఎగ్జామ్పుల్ గా తీసుకున్నారు. వారిలో రామ్ చరణ్ ఒకరు. మిగతా ఐదుగురు హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ యాక్టర్స్. అలా టాప్ స్టార్స్ ఉన్న లిస్టులో చోటుదక్కించుకున్న ఏకైక ఇండియన్ హీరోగా రికార్డ్స్ క్రియేట్ చేశారు రామ్ చరణ్. 

ఈ న్యూస్ చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది కదా క్రేజ్ అంటే.. రామ్ చరణ్ నిజమైన గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు చిరంజీవి తనయుడా మజాకా అంటూ కాలర్ ఎగరేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 2024 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.