
కన్నడ సూపర్ స్టార్ మమ్ముట్టి(Mammootty) ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ భీష్మపర్వం(Bheeshmaparvam ). దర్శకుడు అమల్ నీరద్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక ఫ్యామిలీకి చెందిన అన్నాదమ్ముల మధ్య జరిగే ఆదిపత్యపోరు కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఒక కుటుంబం, అధికారం కోసం అన్నదమ్ములు శత్రువులుగా మారడం, ఆ కుటుంబాలను కలపడానికి ప్రత్నించే ఇంటి పెద్ద. వీరి మధ్య సాగే ఎమోషనల్ జర్నీని ఈ సినిమా.
Also Read: దిష్టిబొమ్మల థ్రిల్లర్ ఎలా ఉందంటే?
అధికారం కోసం ఒకరిపై ఒకరు వేసుకునే ఎత్తులు పై ఎత్తులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ను థ్రిల్లింగ్ చేస్తాయి. అందుకే ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కంటెంట్ ను ఇష్టపడేవారైతే మీరు కూడా చూశేయండి.