ట్రక్కును రోడ్డు పక్కకు తోసేసిన ఏనుగు

ట్రక్కును రోడ్డు పక్కకు తోసేసిన ఏనుగు

ఆకలి అయిందో.. లేక వెహికల్‌‌‌‌ సౌండ్‌‌‌‌కు చిర్రెత్తుకొచ్చిందో తెలియదు కానీ.. ఓ ఏనుగు ట్రక్కును రోడ్డు పక్కకు తోసేసింది. ఈ ఘటన థాయ్​లాండ్‌‌‌‌లోని ఈస్టర్న్‌‌‌‌ థా టకియాప్‌‌‌‌ జిల్లాలోని వైల్డ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ శాంక్చురీలో శనివారం జరిగింది. ట్రక్కును ఏనుగు తన తొండంతో పల్టీలు కొట్టించిన వీడియో సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌గా మారింది. అభయారణ్యంలో ఓ ఏనుగు రోడ్డు దాటుతుంటే  ఓ ట్రక్కు అటుగా వచ్చింది. వెంటనే ఏనుగు తన తొండంతో ట్రక్కును రోడ్డు పక్కకు నెట్టేసింది. దీంతో ట్రక్కు బోల్తా పడింది. విషయం తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ట్రక్కు డ్రైవర్‌‌‌‌‌‌‌‌ను కాపాడారు. కాగా, ఏనుగు చేసిన పనికి ఆ రోడ్డు మార్గంలో ట్రాఫిక్‌‌‌‌ నిలిచిపోయింది.
‑ బ్యాంకాక్‌‌‌‌