వాహనాలపై వెళ్లేటప్పుడు కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా పదే పదే హారన్ మోగిస్తుంటారు. ఆ సౌండ్ ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. అయినా ఊరుకోరు.. పదే పదే హారన్ సౌండ్ చేస్తుంటారు. కొన్ని శబ్దాలు కర్ణకఠోరంగా ఉంటాయి. అదే తాజాగా హారన్ సౌండ్ తో ఓ ఏనుగు బైకర్ పై దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది.
అడవుల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అడవి జంతువులను బెదరగొట్టినా, కంగారు పెట్టినా అవి తిరగబడి దాడి చేస్తాయి. అదృష్టం బాగుండకపోతే విషయం ప్రాణాలమీదకు వస్తుందని రుజువు చేసే వీడియో వైరల్(Viral video) అవుతుంది.
వీడియోలో కనిపించిన దాన్ని ప్రకారం, ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై అడవి గుండా వేసిన ఓ రోడ్డులో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా బైక్ చెడిపోతుంది. దీంతో, అతడి వాహనం రోడ్డుకు అడ్డంగా ఆగిపోతుంది. ఆ సమయంలో వెనుకగా ఓ కారు వచ్చి ఆగింది. బైకర్‌ను పక్కకు తప్పుకోమంటూ కారు డ్రైవర్ హారన్ కొట్టాడు. అప్పటికే ఓ పెద్ద ఏనుగు రోడ్డు పక్కన పొదల్లో నిలబడి ఉంది. కారు డ్రైవర్ హారన్ వినగానే దానికి చిర్రెత్తుకొచ్చింది. కోపంలో అది బైకర్‌పై దాడికి ట్రై చేసింది(Elephant tries to attack biker). అయితే, అప్పటికే బండి స్టార్టవడంతో ఆ బైకర్ తన బండి మీద ఎక్కాడు కానీ కంగారు బైక్‌ను పొదల్లోకి పోనిచ్చేశాడు. అతడి వెనకే ఏనుగు కూడా పరిగెత్తడంతో అతడు బైక్‌ను పొదల్లో వదిలేసి పరిగెత్తడం ప్రారంభించాడు. ఆ తరువాత వెనకే వస్తున్న కారులో ఎక్కి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అప్పుడప్పుడు సడెన్ గా అడవి జంతువులు దాడి చేయడం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు బాగానే ఉన్న అవి ఎందుకో ఒక్కసారిగా మీదకు వస్తూ ఉంటాయి. అందుకే అడవిలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం లేదంటే చాలా ప్రమాదమే జరగొచ్చు. అయితే కొన్ని కొన్ని సార్లు మన తప్పు వల్ల కాకుండా వేరే వారి తప్పులకు మనం బలవుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఓ బైకర్ పరిస్థితి మారింది.
అందుకే అడవి ప్రాంతంలో వెళ్లేటప్పుడు ఎక్కువ శబ్థాలు చేయడం, అరవడం లాంటివి చేయకూడదు. అడవి జంతువులు ఏ మాత్రం డిస్ట్రబ్ అయిన అది మన ప్రాణాల మీదకే వస్తుంది. అందుకే అడవిలో పర్యటించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా అటవీ అధికారులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే దీనిని చాలా మంది వీక్షించారు. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ఆ బైకర్ చాలా లక్కీ అని అందుకే ప్రాణాలతో బయటపడ్డాడని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు కారులో ఉన్న వ్యక్తిని తిట్టిపోస్తున్నారు. అడవిలో వెళ్లే హారన్ కొట్టకూడదని ఆ మాత్రం తెలియదా నీ వల్ల ఒకరి ప్రాణం పోయేదని అంటున్నారు.