కోళ్లఫామ్​లో డ్రగ్స్​ తయారీ.. నాగర్​కర్నూల్​జిల్లాలో భారీగా డ్రగ్స్ ​స్వాధీనం

కోళ్లఫామ్​లో డ్రగ్స్​ తయారీ.. నాగర్​కర్నూల్​జిల్లాలో భారీగా డ్రగ్స్ ​స్వాధీనం

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో అక్రమంగా తయారు చేస్తున్న మాదకద్రవ్యాల గుట్టు రట్టయ్యింది. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ శివారులో మాదకద్రవ్యాల తయారీ కేంద్రంపై పక్కా సమాచారంతో డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌) అధికారులు దాడులు చేశారు. మారుమూల ప్రాంతంలోని కోళ్లఫాంలో మాదకద్రవ్యాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

రూ.3.14 కోట్లు విలువైన 31.42 కిలోల అల్ఫ్రాజోలమ్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న మిషనరీని కూడా సీజ్‌ చేశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.