ఆర్టీసీ బస్సు బోల్తా...15 మందికి గాయాలు  

ఆర్టీసీ బస్సు బోల్తా...15 మందికి గాయాలు  

వనపర్తి జిల్లా కొత్తకోట హైవేపై ఆర్టీసీ బస్సు ఇవాళ తెల్లవారుజామున బోల్తా పడింది. ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్టకు చెందిన ఆర్టీసీ బస్సు 37 మంది ప్రయాణికులతో హైదరాబాదు నుండి తిరుపతి వెళ్తోంది. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో కొత్తకోట పట్టణం నుంచి వెళ్తుండగా.. మదర్ థెరిసా జంక్షన్ దగ్గరకు రాగానే ఉన్నట్టుండి బస్సు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం,  నిర్లక్ష్యం కారణంగానే బస్సు బోల్తా పడిందని పోలీసులు చెబుతున్నారు.